TG: గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు మృతి చెందిన విషాదకరమైన ఘటన సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన రాము బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి లక్ష్మీ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.