హర్యానాలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రజల నుంచి గట్టి మద్దతు లభిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు దృఢ నిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు.