జమ్ముకశ్మీర్‌లోని కాంగ్రెస్- ఎన్సీ కూటమిపై కేంద్రమంత్రి జేపీ నడ్డా మండిపడ్డారు. కాంగ్రెస్- ఎన్సీలు పాక్ ఏజెంట్లని వ్యాఖ్యానించారు. బీజేపీ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే వారు మాత్రం పాక్‌తో చర్చలు జరపాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370 విషయంలో వారి వైఖరి సరికాదన్నారు. బీజేపీకి అధికారాన్ని కట్టబెడితే జమ్మూలో ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేస్తామంటూ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.