TG: బీసీ కులగణన అనేది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన అన్ని సీఎం రేవంత్ అన్నారు. అందుకే బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని.. ప్రజల్లో ఉన్న వారికే జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని పేర్కొన్నారు. నాలుగోసారి గెలిచేందుకే ప్రధాని మోదీ జమిలీ అంటున్నారని.. జమిలీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.