అమెరికాలో జరుగుతున్న క్వాడ్ సదస్సుపై చైనా మీడియా మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. ఇండో- పసిఫిక్ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు క్వాడ్ దేశాలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. కాగా, ఈ భేటీపై బీజింగ్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. చైనా, దాని పొరుగు దేశాల మధ్య విభేదాలను పెంచటానికి విభజించు, పాలించు అనే వ్యూహాన్ని క్వాడ్ అనుసరిస్తుందని పేర్కొంది. ఈ సదస్సులో భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు.