TG: రాష్టవ్యాప్తంగా ఈ ఏడాది తొలి 3 నెలల్లో 500కుపైగా NDPS కేసులు నమోదు కాగా.. 981 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 70శాతం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ విద్యార్థులే ఉన్నట్లు TG న్యాబ్ తెలిపింది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థి దశ నుంచే గంజాయి మత్తుకు అలవాటు పడినట్లు పేర్కొంది. మత్తు బానిస అయిన వారు డబ్బుల కోసం ఇతరులకు గంజాయిని అమ్ముతున్నట్లు తేలిందని చెప్పింది. వీరిలో టెకీలు కూడా ఉన్నారు.