NLR: దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పర్యటించనున్నారు. 22వ వార్డు పేరారెడ్డి పల్లెలో జరగనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వెంకటగిరి పోలేరమ్మ ఉత్సవాలకు హాజరవుతారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి పర్యటనను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయలని నాయకులు పిలుపునిచ్చారు.