AP: రాష్ట్రంలో ఓ వర్గం మహిళలపై మరో వర్గం నేతలు దాడి చేశారు. మార్కాపురం నియోజకవర్గం పొదిలి పట్టణం ఐదవ వార్డులోని నవాబుమెట్టలో ప్రతిపక్ష మహిళా కార్యకర్తలపై అధికార వర్గ నేతలు కర్రలు, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ ట్వీట్ చేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు రావణ కాష్టంగా మార్చారని మండిపడింది.