అట్టహాసంగా జరగాల్సిన ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం తీరుపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సినిమా కోసం ఎల్బీ స్టేడియంలో ఈవెంట్ జరుపుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ‘కల్కి’కి ఔట్ డోర్ పర్మిషన్ ఇచ్చారు. కానీ మా దేవరకు ఎందుకు ఇవ్వలేదు అంటూ ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు, నిర్వహకులు ఫెయిల్ అయ్యారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.