TG: మాదాపూర్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్ పార్క్ ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కు స్థలంలో ఏర్పాటైన స్పోర్ట్స్ అకాడమీపై ఫిర్యాదు చేయగా హైడ్రా చర్యలు తీసుకుంది. దీంతో అక్కడ అక్రమ షెడ్లను కూల్చివేసింది. అయితే పార్టు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామన్న స్టోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు.. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.