కడప: ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందిస్తుందని టీడీపీ రాష్ట్రం మహిళ ఉపాధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణ పరిధిలోని బోయపాలెం, ఈడుగపాలెం వీధులలో ప్రభుత్వం చేసిన మంచి పనులను తెలియజేసినట్లు వివరించారు. ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు.