45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ 2 స్వర్ణాలు గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చెస్ ఛాంపియన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అనుకరించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన సమయంలో రోహిత్ శర్మ.. ట్రోఫీని అందుకునేందుకు క్యాట్ వాక్ చేస్తూ వస్తాడు. ఇప్పుడు అలాగే చెస్ ఛాంపియన్లు కూడా క్యాట్ చేస్తూ వచ్చారు. దీంతో ఈ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తూ.. చెస్ ఛాంపియన్లు రోహిత్ శర్మను అనుకరించారని కామెంట్లు చేస్తున్నారు.