AP: తిరుమలలో శాంతి హోమం ముగిసింది. లడ్డూ అపవిత్రం అయిందన్న ప్రచారం నేపథ్యంలో టీటీడీ శాంతి హోమం చేపట్టింది. ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకు మొదలైన హోమం 10 గంటల వరకు కొనసాగింది. విమాన ప్రాకారం దగ్గర 3 హోమగుండాలతో మహా క్రతువు కొనసాగింది. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులతో యాగం నిర్వహించారు. హోమం తర్వాత పంచగవ్య ప్రోక్షణ నిర్వహిస్తున్నారు అర్చకులు.