AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. నిన్న 82,406 మంది స్వామివారిని దర్శించుకోగా 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లు సమర్పించారు. టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది.