AP: లడ్డూ ప్రసాదం అపవిత్రం అయిన నేపథ్యంలో ఇవాళ తిరుమలలో శాంతియాగాన్ని చేయనున్నారు. విమాన ప్రాకారం వద్ద ఉన్న యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి శాంతియాగాన్ని, తర్వాత పంచగవ్య ప్రోక్షణను అర్చకులు నిర్వహించనున్నారు. ఇందుకోసం 3 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. ఈ యాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొననున్నారు. దేవాదాయ శాఖ తరఫున అన్ని ఆలయాల్లోనూ ఇటువంటి హోమాలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.