AP: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలోకి ఓ వైసీపీ ఎంపీటీసీ చొరబడ్డాడు. అతడు సీసీ కెమెరాలు, పరిసర ప్రాంతాలపై రెక్కీ చేశాడని.. తమ వాళ్లు అతన్నిగుర్తించి తన వద్దకు తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. ఎంపీటీసీని పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. అతని మాటలు అనుమానాస్పదంగా అనిపించాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తన భద్రతను తొలగించారని.. తన భద్రతపై ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఆనం పేర్కొన్నారు.