TG: అధికారులను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, పోలీసు అధికారులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో లిస్ట్ రెడీ చేస్తున్నామని తెలిపారు. ఏ అధికారి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో గుర్తుపెట్టుకుంటామన్నారు. తరువాత ఇబ్బందులు పడక తప్పదని, ఏపీలో ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదా అని పేర్కొన్నారు.