TG: పేదల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అప్పులకు తాము వడ్డీ కడుతున్నట్లు చెప్పారు. ఇచ్చిన ప్రతీ హామీని తప్పకుండా నెరవేరుస్తామని తెలిపారు. చెరువుల ఆక్రమణలతోనే ముంపు సమస్య అని, చెరువులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఆడపడుచులందరికీ చేనేత చీరలు ఇస్తామని చెప్పారు.