AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఇంకా అధికారుల తీరు మారడం లేదని ఎద్దేవా చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైసీపీకి పూర్తిగా దాసోహం అయ్యారని విమర్శించారు. ఆర్ధిక, రాజకీయ ఒత్తిడులకు ఉన్నతాధికారులు తలొగ్గకూడదని సూచించారు. కాగా.. పిఠాపురం సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.