TG: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1990లో చార్మినార్ వద్ద కాంగ్రెస్ జెండాను ఎగరవేసి సద్భావనా యాత్ర ప్రారంభించారు. నేటితో 34 సంవత్సరాలు పూర్తి అవుతుండటంతో నేడు టీపీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ చార్మినార్ వద్ద పార్టీ జెండాను ఎగరేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు కూడా హాజరు కానున్నారు. అనంతరం మాజీ మంత్రి గీతా రెడ్డికి సద్భావనా అవార్డు ప్రధానం చేయనున్నారు.