రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తినడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆస్తమా, దగ్గు వంటి సమస్యలు దూరమవుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్త సరఫరా మెరుగుపడటంతో పాటు హైబీపీ తగ్గుతుంది.