TG: చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. టెర్మినల్ పనులు దాదాపు పూర్తయ్యాయని.. అక్కడి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు చేపట్టాలని సూచించారు. చర్లపల్లిలో 20 రైళ్లు ఆగే సదుపాయం ఉందని.. ఈ టెర్మినల్ పూర్తయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ట్రాఫిక్ తగ్గుతుందని వెల్లడించారు.