AP: చంద్రగిరి MLA పులివర్తి నాని భార్య సుధారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ చంద్రగిరి జర్నలిస్టులు పోలీసులను ఆశ్రయించారు. ‘చంద్రగిరి రాజకీయం’ అనే వాట్సాప్ గ్రూప్‌ను డిలీట్ చేయాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని స్థానిక CIకి ఫిర్యాదు చేశారు. కాగా MLAకి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారని ఈ నెల 13న సుధారెడ్డి గ్రూప్ అడ్మిన్లతో పాటు ఐదుగురు జర్నలిస్టులపై ఫిర్యాదు చేశారు.