TG: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను గత ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులను ఆ పార్టీ వాళ్లు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలనని 2021లోనే కేటీఆర్ ఆదేశించారని.. కానీ అప్పట్లో మాటలతోనే కాలం గడిపారని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రక్రియ చాలా క్లిష్టమైందని అన్నారు.