కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్ధానాలు చేస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వాల్‌లో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉందని, ఇక ప్రజలు తమకు అధికారం అప్పగిస్తారని కాంగ్రెస్ భావిస్తోందని తెలిపారు. గతంలో మధ్యప్రదేశ్ విషయంలోనూ ఇదే విధంగా అపోహ పడిందని పేర్కొన్నారు.