ఉదయం అల్పాహారం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైందని వైద్యులు చెబుతుంటారు. అయితే ఉదయం పూట టిఫిన్ తినకపోవడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదంతో పాటు రక్తంలో చెక్కర స్థాయి పెరుగుతుందట. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రోగనిరోధకశక్తి తగ్గుతుంది. దీనివల్ల అనేక వ్యాధులు చుట్టుముడతాయి. కడుపుని ఎక్కువసేపు ఆకలితో ఉంచడం వల్ల లోపలి కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఊబకాయం, వేగంగా బరువు పెరగడం, జీవక్రియ మందగించడం వంటి అనేక సమస్యలు వస్తాయి.