అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలిసిన విషయమే. కానీ జలుబు, దగ్గు వస్తాయని చాలామంది తినరు. అరటి పండులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ పండు తినడం వల్ల దగ్గు, జలుబు రావని వైద్యులు స్పష్టం చేశారు. వాతావరణంలోని వైరస్ల కారణంగా ఈ వ్యాధులు వస్తాయన్నారు. జలుబు ఉన్నప్పుడు అరటి పండ్లు తింటే కఫం పెరిగి సమస్యలు పెరిగే అవకాశం ఉందన్నారు. కావున అలాంటి సమయాల్లో తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.