AP: అన్నా క్యాంటీన్లపై టీడీపీ రంగులు వేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడంతో నేడు విచారణ జరిగింది. కలర్ బట్టి పార్టీని ఎలా డిసైడ్ చేస్తారని, అన్నా క్యాంటీన్‌కు ఇంతకు ముందు ఏ కలర్ వేశారని ప్రశ్నించింది. గతంలో గ్రామ సచివాలయాలకు బ్లూ కలర్ వేయటంపై తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని పిటిషనర్ తెలిపారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.