TG: హైడ్రా విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళతామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా సీఎం చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల కన్నీటికి కారణమైతే పతనం తప్పదని హెచ్చరించారు. హైడ్రాను నియమించిన రోజే ఇది డ్రామా అని చెప్పానని గుర్తు చేశారు. పేదలపై కనికరం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు.