టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఇటలీ ప్రధాని మెలోని దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన మస్క్.. తాము డేటింగ్లో లేమని స్పష్టం చేశారు. కాగా, కొన్ని రోజుల క్రితం న్యూయార్క్లో మెలోనికి అట్లాంటిక్ కౌన్సిల్ గ్లోబల్ సిటిజన్ అవార్డును మస్క్ అందజేశారు. ఆమెకు అవార్డును అందజేయడం గర్వంగా ఉందని మస్క్ తెలిపారు.