AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా నాలుగు రోజులపాటు జనసేన పార్టీ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈనెల 30న దీపారాధన, అక్టోబర్ 1న ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం, 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేపట్టనున్నారు. పార్టీ నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు.