యూఏఈ వేదికగా టీ20 మహిళా ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు అక్కడికి చేరుకుంది. అదే సమయంలో హీరో రానా దగ్గుబాటి కూడా దుబాయ్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా మహిళా జట్టును ఆయన కలిశాడు. వరల్డ్ కప్‌ను గెలుచుకురావాలంటూ వారికి అల్ ది బెస్ట్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.