TG: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 51 వేల కూసెక్కులు వస్తుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, 318.460 మీటర్లు ఉంది. నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, 9.542 టీఎంసీలు ఉంది. ఎడమ కాల్వకు 920, కుడి 720, భీమా 650, RDS కాల్వకు 50, విద్యుదుత్పత్తికి 37,176 క్యూసెక్కులు మొత్తంగా 61,276 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.