»Women Battles Crocodile With A Stick To Save Her Husbands Life In Rajasthan
Rajasthan News : ఇది కదా ప్రేమంటే… భర్త కోసం ఏకంగా మొసలితో పోరాడిన భార్య…!
Rajasthan : భర్త మీద ఏ భార్యకైనా ప్రేమ ఉంటుంది. భర్త ప్రాణాలతో ఉండాలని చాలా మంది పూజలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఓ మహిళ మాత్రం భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డు వేసింది. మొసలి నోటికి ఆహారంగా దొరికిన భర్తను కాపాడుకోవడానికి ఏకంగా పోరాటం చేసింది.
భర్త మీద ఏ భార్యకైనా ప్రేమ ఉంటుంది. భర్త ప్రాణాలతో ఉండాలని చాలా మంది పూజలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఓ మహిళ మాత్రం భర్త ప్రాణాల కోసం తన ప్రాణాలను అడ్డు వేసింది. మొసలి నోటికి ఆహారంగా దొరికిన భర్తను కాపాడుకోవడానికి ఏకంగా పోరాటం చేసింది. ముసలితో పోరాడి.. తన భర్తను కాపాడుకుంది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మండరాయల్ సబ్ డివిజనులో బనీసింగ్ మీనా అనే వ్యక్తి మేకల మందను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వాటిని నీళ్ల కోసం చంబల్ నది వద్దకు తోలుకెళ్లిన వెళ్లిన బనీసింగ్ మీనా.. తనకూ దాహంగా ఉండటంతో నీళ్లు తాగేందుకు ప్రయత్నించాడు. రెండు దోసిళ్లతో నీరు తాగబోతుండగా.. నది లోపలి నుంచి ఓ మొసలి దాడి చేసింది. బనీసింగ్పై దాడి చేసిన మొసలి అతడి కాలిని నోట కరచి నీటి లోపలికి లాక్కొని పోయేందుకు ప్రయత్నించింది. ఊహించని ఈ ఘటనతో బిత్తరపోయిన బనీసింగ్ గట్టిగా కేకలు వేశాడు.
కొద్ది దూరంలో ఉన్న భార్య విమలాబాయి.. భర్త కేకలు విని అక్కడికి చేరుకుంది. పరిస్థితిని చూసి వెంటనే చేరుకున్న ఆమె.. నీటికి దగ్గరగా వెళ్లి చేతిలో ఉన్న కర్రతో మొసలి తలపై పదే పదే బాదింది. పావుగంట పాటు ఆమె మొసలితో పోరాటం చేసింది. దీంతో కాసేపటికి బనీసింగ్ కాలు వదిలేసి మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. చుట్టుపక్కల గొర్రెలు మేపుతున్న వారంతా అక్కడికి చేరుకుని తీవ్రంగా గాయపడిన బనీసింగ్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ఆ సమయంలో తనకు తన ప్రాణాలకన్నా.. తన భర్త ప్రాణాలే ముఖ్యమని అనిపించిందని ఆమె తర్వాత చెప్పడం విశేషం. భర్త కోసం ఆమె చేసిన పోరాటాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వీర వనిత అంటూ కొనియాడుతున్నారు.