»Woman Climbed 150 Feet High Tower After A Fight With Lover Twist Came When Boyfriend Climbed To Persuade
Chhattisgarh:లవర్ తో గొడవపడి టవర్‌ను ఎక్కిన మహిళ.. కాపాడేందుకు వెళ్తే పెద్ద ట్విస్ట్
ప్రియురాలిని ఒప్పించేందుకు ప్రేమికుడు కూడా స్తంభం ఎక్కాడు. దాదాపు అరగంట సేపు టవర్లోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. దీంతో ప్రియురాలు టవర్ దిగేందుకు సిద్ధమైంది.
Chhattisgarh:ఛత్తీస్‌గఢ్‌లోని గోరెల-పెండ్రా-మార్వాహి (GPM) జిల్లాలోని కొడ్గర్ గ్రామంలో ఓ హై వోల్టేజ్ డ్రామా జరిగింది. ప్రియుడిపై కోపంతో ప్రియురాలు దాదాపు 150 అడుగుల ఎత్తున్న హై ఓల్టేజ్ స్తంభం పైకి చేరుకుంది. ప్రియురాలిని ఒప్పించేందుకు ప్రేమికుడు కూడా స్తంభం ఎక్కాడు. దాదాపు అరగంట సేపు టవర్లోనే ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. దీంతో ప్రియురాలు టవర్ దిగేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి టవర్ నుంచి కిందకు దిగారు. అయితే హైవోల్టేజీ డ్రామా గురించి సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, వారిని విచారించిన తర్వాత ఇకపై అలా చేయవద్దని వారికి సూచించి వదిలేశారు.
వివరాల్లోకి వెళితే అనిత భైనా అనే యువతి గోరెళ్లలోని న్యూరి నవపర గ్రామానికి చెందినది. గత 2 రోజుల క్రితం పెండ్రాలోని కోడ్గర్ గ్రామంలో నివసిస్తున్న ముఖేష్ భైనా ఇంటికి చేరుకుంది. ఆ అమ్మాయి ముఖేష్ భైనాతో 2 రోజులు ఉండిపోయింది. ఆ తర్వాత అకస్మాత్తుగా గురువారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య ఏదో విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ వివాదంతో మనస్తాపానికి గురైన అనిత ఇంటి నుంచి బయటకు వెళ్లి పక్కనే ఉన్న టవర్‌పైకి ఎక్కింది. ప్రియురాలు టవర్ పైకి వెళ్లి కూర్చుంది. కొంతమంది గ్రామస్తులు టవర్‌ను చూడగా, వారు యువతిని గుర్తించారు.. దూరం నుండి అరుస్తూ ఆమెను కిందకు దిగమని కోరారు. కొద్దిసేపటికే హైటెన్షన్ టవర్ దగ్గర జనం గుమిగూడారు. ఇంతలో యువకుడు ముఖేష్ భైనా కూడా టవర్ దగ్గరకు చేరుకున్నాడు. టవర్ ఎక్కుతున్న అమ్మాయి అనిత అని వెంటనే అర్థం చేసుకున్నాడు. అతను కూడా టవర్ పైకి ఎక్కి ఆమెను కిందకు దించే ప్రయత్నం మొదలుపెట్టాడు.
టవర్ ఎక్కి అనితను ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ముఖేష్. చాలా కష్టపడి రెండు టవర్ల మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చాలాసేపు చర్చ జరగడంతో యువతి టవర్ నుంచి కిందకు దిగేందుకు అంగీకరించింది. ఇంతలో గ్రామస్తుల సమాచారంతో పెండ్ర పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ అనంతరం పోలీసులు అనితను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనితకు పెళ్లయిందని చెబుతున్నారు. ఆమె భర్తతో విడివిడిగా జీవిస్తోంది. ఈలోగా ముఖేష్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది.