Jnanpith Award : 58వ జ్ఞానపీఠ అవార్డుకు ప్రముఖ సినీ నిర్మాత, గీత రచయిత, ఉర్దూ కవి గుల్జార్‌తో పాటు సంస్కృత భాషా పండితుడు జగద్గురు రాంభద్రాచార్య ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ అవార్డు 2023కి గుల్జార్, జగద్గురు రాంభద్రాచార్య ఎంపికైనట్లు అవార్డుకు సంబంధించిన ఎంపిక ప్యానెల్ తెలిపింది. గుల్జార్ ఇప్పటికే సాహిత్య అకాడమీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. రామభద్రాచార్యను పద్మవిభూషణ్‌తో సత్కరించారు. తన అద్భుతమైన క్రియేషన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గేయ రచయిత గుల్జార్‌కు ఉర్దూ భాషకు చేసిన సాటిలేని కృషికి జ్ఞానపీఠ్ అవార్డును ప్రకటించారు. దీనితో పాటుగా జగద్గురు రామభద్రాచార్య సంస్కృత భాషకు చేసిన కృషికి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపిక చేయబడింది. రంభద్రాచార్య చిత్రకూట్‌లోని తులసి పీఠం వ్యవస్థాపకుడు , అధిపతి, ప్రపంచ ప్రఖ్యాత హిందూ ఆధ్యాత్మిక గురువు, ఉపాధ్యాయుడు, 100 కంటే ఎక్కువ పుస్తకాల రచయిత.
గుల్జార్ తన పాటల రచనకు, హిందీ చిత్రసీమలో ప్రత్యేకమైన చిత్రాలను రూపొందించడంలో ప్రసిద్ధులు. ప్రస్తుత కాలంలోని అద్భుతమైన ఉర్దూ కవులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇంతకుముందు, గుల్జార్ ఉర్దూ భాషలో చేసిన కృషికి 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్ , కనీసం 5 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. గుల్జార్ ప్రసిద్ధ రచనలు చాంద్ పుఖ్రాజ్ కా, రాత్ పష్మినే కి, పంచ్ పాంచ్ పచత్తర్.
గుల్జార్ అసలు పేరు సంపూర్ణ సింగ్ కల్రా. అతను అవిభక్త భారతదేశంలోని జీలం జిల్లాలోని దేనా గ్రామంలో 1934 ఆగస్టు 18న జన్మించాడు. అతని తండ్రి పేరు మఖన్ సింగ్ చిన్న వ్యాపారం చేసేవాడు. తల్లి మరణానంతరం ఎక్కువ సమయం తండ్రితోనే జీవించాడు. అయితే చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో 12వ తరగతి పరీక్షలో కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ సాహిత్యం పట్ల ఆసక్తి మాత్రం అలాగే ఉండిపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్ చంద్ అతని అభిమాన సాహితీవేత్తలు.
పుట్టిన 2 నెలలకే కంటి చూపు కోల్పోయిన జగద్గురు రామభద్రాచార్యులు అద్భుతమైన ఉపాధ్యాయుడు, సంస్కృత భాషా పండితుడు. జగద్గురు రామభద్రాచార్యులు, అనేక భాషలలో జ్ఞాని, 100 కి పైగా పుస్తకాలు రచించారు. ఆయనకు 22 భాషల్లో పరిజ్ఞానం ఉంది. జగద్గురు రామభద్రాచార్య కూడా పద్మవిభూషణ్‌తో సత్కరించారు. జగద్గురు రామభద్రాచార్యను భారత ప్రభుత్వం 2015లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. రామభద్రాచార్యుల ప్రసిద్ధ రచనలు శ్రీ భార్గవరాఘవీయం, అష్టావక్ర, ఆజాద్‌చంద్రశేఖరచరితం, లఘురఘువరం, సరయుల్హరి, భృంగదూతం, కుబ్జపత్రం.