ముంబయి(Mumbai)లోని సియాన్ రైల్వేస్టేషన్లో జరిగిన ఈ విషాదకర ఘటన చొటు చేసుకుంది.చిన్న అపార్థం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రైల్వే ప్లాట్‌ఫామ్ (Railway platform)పై పక్కనే నిల్చున్న వ్యక్తి తను వేధించడని ఓ మహిళ పొరబాటు పడింది. అది వాస్తవమే అని నమ్మిన ఆమె భర్త.. ఆ వ్యక్తిని కొట్టాడు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ అతడు పట్టాలపై పడటం, ట్రైన్ అతడిపైనుంచి దూసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్ మానె, శీతల్ దంపతులు మన్‌ఖుర్ద్ వెళ్లేందుకు సియాన్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రైలు కోసం ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తుండగా.. 26 ఏళ్ల దినేశ్ రాథోడ్ (Dinesh Rathore) అటుగా వస్తూ శీతల్‌కు తగిలాడు. రాథోడ్ ఉద్దేశపూర్వకంగానే అలా చేస్తున్నాడని భావించిన ఆమె.. అతడితో గొడవ పెట్టుకుంది. తన వద్ద ఉన్న గొడుగుతో కొట్టింది. ఇది గమనించిన శీతల్ భర్త అవినాశ్.. తన భార్యను రాథోడ్ అసభ్యంగా ప్రవర్తించాడని పొరబడ్డాడు.రాథోడ్‌తో వాగ్వాదానికి దిగి అతడిని బలంగా కొట్టడంతో బ్యాలెన్స్ కోల్పోయిన రాథోడ్.. రైలు పట్టాలపై పడిపోయాడు. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు.
పట్టాల మధ్య పడిపోయిన రాథోడ్ ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించేలోపే రైలు దూసుకురావడంతో రాథోడ్ దాని కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు (Police) నిందితులను ధారావి ప్రాంత వాసులుగా గుర్తించి అరెస్టు చేశారు.అదే సమయంలో రైలు వస్తుండడంతో తోటి ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రైలు వెళ్లడంతో అతడు స్పాట్లోనే మృతిచెందాడు. ఈ షాకింగ్ ఘటనలో అక్కడ ఉన్న ప్రయాణికులందరూ షాక్‌కు గురయ్యారు. మొత్తానికి క్షణికావేశంలో చేసిన ఓ పొరపాటు కారణంగా ఓ యువకుడి నిండు జీవితం బలైపోయింది. యువకుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
An innocent man lost his life just because a woman thought he was misbehaving with her. Her husband punched this man so hard that he fell on track & got crushed under the train. Incident caught on CCTV. Both Avinash Mane & Sheetal Mane have been arrested for culpable homicide pic.twitter.com/YdnP9zpUON
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 17, 2023