»Students To Have Biannual 10th 12th Board Exam Option From 2025 26
board exams : టెన్త్, ఇంటర్లకు వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు పరీక్షలు
టెన్త్, ఇంటర్ విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు రాసే సౌలభ్యం కలగనుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
board exams : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్(inter), పదో తరగతి చదువుకునే విద్యార్థులు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు రాసే విధానం అమల్లోకి రానుంది. అయితే సెమిస్టర్ పద్ధతిలో ఈ పరీక్షలు పెడతారా? లేదంటే ఒకే సిలబస్ పై రెండు సార్లు పరీక్షలు పెడతారా? అనే విషయంలో స్పష్టత రాలేదు. 2025 -26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు అవుతుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో పీఎం శ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఒత్తిడి దూరం అవుతుందన్నారు. ఉత్తమ స్కోర్లను సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. ఈ ఫార్ములా ద్వారా దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
పాఠశాల విద్యలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్ ఫ్రేమ్ వర్క్‌ని రూపొందించారు. దీని ప్రకారం పరీక్షలు ఏడాదికి రెండు సార్లు జరగాలని ప్రతిపాదనలు జరిగాయి. బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది నుంచి ఇలాగే జరుగుతాయని విద్యా శాఖ చెబుతోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.