»Tata Nexon Facelift Scores 5 Star Safety Rating From Global Ncap
Tata Nexon : టాటా నెక్సాన్ భద్రతకు 5 స్టార్ రేటింగ్
ఇటీవల కాలంలో కార్లు కొనుక్కునే వారంతా భద్రతను దృష్టిలో పెట్టుకుంటున్నారు. టాటా నెక్సాన్ సేఫ్టీ విషయంలో అంతర్జాతీయ పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్‌ని సంపాదించుకుంది.
Tata Nexon Scores 5-Star Safety Rating : టాటా నెక్సాన్ ఇప్పుడు మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఎస్‌యూవీల్లో(SUV)ఒకటి. చాలా మంది కార్లను కొనుక్కునేప్పుడు బడ్జెట్‌తో పాటు సేఫ్టీకి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా నెక్సాన్ ప్రపంచ స్థాయి భద్రతా పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్‌ని పొందింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపై మరింత ఎక్కువగా పడింది. సేఫ్టీని ప్రధానంగా భావించే వారంతా ఇప్పుడు దీన్ని కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్‌యూవీల్లో నెక్సాన్ ( Nexon) తడిజైన్ పరంగా, టెక్నాలజీ పరంగా నెక్సాన్ తనదైన ప్రత్యేకతలను కలిగి ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఇది అంతర్జాతీయ భద్రతాత ప్రమాణాల పరీక్ష(NCAP) లో 5 స్టార్ రేటింగ్‌ని సొంతం చేసుకుంది. ఇలాంటి రేటింగ్ పొందిన తొలి భారతీయ కారు ఇదే కావడం గమనార్హం. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా ప్రకటించింది.
ఇది కారులో ప్రయాణించే పెద్దలు, పిల్లల భద్రతపై ప్రత్యేకమైన విధానాల్ని కలిగి ఉంది. కారు ఎంత సురక్షితంగా ఉందో తెలుసుకోవడానికి ముందు, సైడ్ క్రాష్లను పరీక్షించినప్పుడు, సీట్లకు జోడించిన చైల్డ్ మోడల్ బొమ్మలకు ఎటువంటి నష్టమూ జరగలేదు. అందువల్ల, టాటా నెక్సాన్ కారు అన్ని వయసుల వారికి సురక్షితమైన కారుగా గుర్తింపు పొందుతోంది. అందుకనే ఇది మన దేశంలో అత్యంత భద్రమైన కార్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో టాటా హారియర్ కారు ఉంది.