టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్… ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రస్తుతానికి ఆయన చికిత్స డెహ్రాడూన్‌లో కొనసాగుతోంది, అయితే ఇప్పుడు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే DDCA చికిత్స కోసం పంత్‌ను ముంబైకి తీసుకెళ్లనుంది.
డెహ్రాడూన్ మాక్స్ ఆస్పత్రి నుంచి ముంబై కి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు, మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించనున్నారు. ఇక అదే సమయంలో, అతని లిగమెంట్ గాయం చికిత్స చేయబడనుంది. ఈ క్రమంలో డీడీసీఏ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ- క్రికెటర్ రిషబ్ పంత్‌ను తదుపరి చికిత్స కోసం ఈరోజు ముంబైకి తరలించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 30న కారు ప్రమాదంలో పంత్ డెహ్రాడూన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పంత్ తలపై రెండు బలమైన కోతలు లాంటివి పడ్డాయని, బీసీసీఐ తెలిపింది. అలాగే అతని కుడి మోకాలిలో లిగమెంట్స్ చిరిగిపోయాయని, అలాగే ఆయన కుడి మణికట్టు, చీలమండ, కాలికి కూడా గాయాలు ఉన్నాయి.
అలాగే, అతని వీపుపై రాపిడి గాయం ఉందని అంటున్నారు. ఇక పంత్ కి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదంలో లేదు, కానీ ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని BCCI మరియు DDCA నిర్ణయించాయి. త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పంత్‌ను వీలైనంత త్వరగా ఫిట్‌గా ఉండేలా చూడాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంత్ MRI స్కాన్ నివేదికలో ఎటువంటి సమస్య లేదుని, ప్రమాదం తర్వాత, పంత్‌తో నిరంతరం టచ్‌లో ఉండాలని, అతని పరిస్థితిని పర్యవేక్షించాలని BCCI DDCAని ఆదేశించినట్లు సమాచారం.