పాకిస్థాన్ కిక్రెటర్ షోయబ్ మాలిక్ భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యక్తిత్వం గురించి ప్రశంసించారు. ఇండియన్ టీమ్ గెలవాలంటే అతని సూచనలు తప్పనిసరిగా ఉండాలని ఓ ఇంటర్వూలో తెలిపాడు.
Shoaib malik: క్రికెట్లో రాహుల్ ద్రవిడ్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా భారత జట్టుకు అతను ఎన్నో సేవలు అందించాడు. కేవలం ఒక క్రికెటర్‌గా మాత్రమే కాకుండా.. గొప్ప వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నాడు. టీమ్ ఇండియా గెలవాలని రాహుల్ ద్రవిడ్ ఎంతగానో పరితపించేవాడు. ఇతని వ్యక్తిత్వం గురించి పాక్ మాజీ స్టార్ ప్లేయర్ షోయబ్ మాలిక్ ప్రశంసించాడు. ఓ ఇంటర్వూలో రాహుల్ ద్రవిడ్ వ్యక్తిత్వం గురించి తెలిపాడు.
‘పాకిస్ధాన్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్తున్నాం. భారత అండర్-19 జట్టు కూడా మాతో పాటు ప్రయాణిస్తుంది. అండర్-19 జట్టుకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఆ సమయంలో నాకు నిద్ర రావడంతో నేను నిద్రపోయాను. నాతో మాట్లాడాలని ద్రవిడ్ నా కోసం దాదాపు రెండు గంటలు పాటు ఎదురుచూశాడు. నేను లేచిన తర్వాత నువ్వు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్లీ జట్టులోకి ఎలా వచ్చావని అడిగాడు. నేను కోచ్‌గా ఉన్నాను. ఆ సీక్రెట్ ఏంటో నాకు చెబితే నేను మా కుర్రాళ్లకు చెబుతాను‘ అని రాహుల్ ద్రవిడ్ అన్నారని చెప్పాడు.
‘ద్రవిడ్‌లో కొంచెం కూడా అహంకారం కనిపించదు. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవాలనే పరితపిస్తుంటాడు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అందుకే నన్ను అడగ్గానే చెప్పాను. నాకు క్రికెట్ అంటే ఇష్టం. మనం నేర్చుకునే ప్రక్రియకు అంతం ఉండదని చెప్పాను. రాహుల్ కోచింగ్‌లో భారత్ జట్టు ఇప్పుడు ఎక్కడ ఉందో అందరికీ తెలిసిందే. ద్రవిడ్ కష్టపడేతత్వం ఇండియన్ క్రికెట్‌ను గొప్ప స్థాయికి తీసుకెళ్లింది. వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా చాలా బాగా ఆడుతుంది. భారత్ కప్ గెలవాలంటే ద్రవిడ్ సూచనలు తప్పనిసరి’ అని మాలిక్ అన్నాడు. ఒక పాకిస్థాన్ క్రికెటర్ ద్రవిడ్‌ను ప్రశంసించాడంటే అతని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.