»Prime Minister Modi Praised Former Prime Minister Manmohan Singh
PM Modi: మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. వీల్ చైర్లో వచ్చి మరీ తన కర్తవ్యాన్ని నెరవేర్చడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమేనని కొనియాడారు.
Prime Minister Modi praised former Prime Minister Manmohan Singh
PM Modi: రాజ్యసభ(Rajya Sabha)లో 56 మంది ఎంపీల పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం వారికి వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)పై ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ప్రశంసలు కురిపించారు. మోడీ మాట్లాడుతూ.. ఈ దేశానికి మన్మోహన్ సింగ్ ఎంతో సేవ చేశారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి అని అన్నారు. సుదీర్ఘకాలం రాజ్యసభ్యుడిగా ఉంటూ ఆయన అందించిన సేవలు మరువలేనివి అంటూ కొనియాడారు. ఆయన మన దేశాన్ని నడిపంచిన తీరు ఎప్పటికీ మరువలేనిది పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి మరీ తన ఓటును వినియోగించడం హర్షదాయకం అని అన్నారు.
ఇటీవల రాజ్యసభలో ఓ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆయన వీల్ చైర్లో వచ్చి ఓటు వేశారని, ఇది దేశంలో ప్రజాస్వమ్మాన్ని బలోపేతం చేయడమేనని మోడీ అన్నారు. కమిటీ ఎన్నికలు ఉన్న ప్రతిసారి ఆయన ఓటును వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఓ సభ్యుడిగా తన విధుల పట్ల ఉన్న బాధ్యతకు ఇది నిదర్శనమన్నారు.