»Pakistani Boat With 480 Crore Rupees Drug Caught In Join Operation Indian Coast Guard Ncb Ats
Gujarat : గుజరాత్ లో రూ.480కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఆరుగురు పాకిస్థానీలు అరెస్ట్
సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి డ్రగ్స్‌ను తీసుకొచ్చే వ్యాపారం రోజురోజుకు పెరుగుతోంది. అయితే దీనిపై అటు ప్రభుత్వం, ఇటు కోస్ట్‌గార్డు అప్రమత్తంగా ఉన్నాయి.
Gujarat : సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి డ్రగ్స్‌ను తీసుకొచ్చే వ్యాపారం రోజురోజుకు పెరుగుతోంది. అయితే దీనిపై అటు ప్రభుత్వం, ఇటు కోస్ట్‌గార్డు అప్రమత్తంగా ఉన్నాయి. మంగళవారం ATS, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , కోస్ట్ గార్డ్ సుమారు రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ డ్రగ్స్‌ను ఆరుగురు పడవలో తీసుకువస్తున్నారు. పడవ పాకిస్థానీది డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి జాయింట్ ఆపరేషన్‌లో ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG), సుమారు రూ. 480 కోట్ల విలువైన డ్రగ్స్‌తో నిండిన పడవను అడ్డగించింది. మాదక ద్రవ్యాలతో అరెస్టయిన ఈ పాకిస్థానీ పడవలో ఆరుగురు కూడా ఉన్నారు.
ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్‌లు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమన్వయంతో సముద్ర-వాయుమార్గ ఆపరేషన్‌లో పోర్బందర్కు 350 కి.మీ దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో పడవను అడ్డుకున్నారు. ఆపరేషన్‌లో, ICG, NCB, ATS గుజరాత్‌లు కలిసి ఈ మిషన్‌ను నిర్వహించాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏజెన్సీల నుండి నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారంపై మార్చి 11, సోమవారం నాడు అరేబియా సముద్రంలో వ్యూహాత్మకంగా తన నౌకలను మోహరించింది. ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి చీకట్లో అనుమానాస్పదంగా కదులుతున్న పడవను బృందం గుర్తించింది.
బృందం బోటును గుర్తించిన తర్వాత పడవలోని నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ICG నౌకలు తెలివిగా వెంబడించి, వారి పడవను నిలిపివేశారు. ఆ తర్వాత బోటులోకి ఎక్కిన ఐసీజీ బృందం.. విచారించగా కోట్ల విలువైన డ్రగ్స్ దొరికాయి. పాకిస్థాన్ బోటులోని ఆరుగురిని అరెస్టు చేశారు. జాయింట్ బోర్డింగ్ బృందం జరిపిన విచారణ, పడవలో జరిపిన సోదాల్లో నిందితుల వద్ద సుమారు 80 కిలోల డ్రగ్స్ కూడా ఉన్నట్లు తేలింది. బోటు దాని సిబ్బందిని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం పోర్బందర్కు తీసుకెళ్లారు. గత మూడేళ్లలో ఏటీఎస్ గుజరాత్, ఎన్సీబీతో కలిసి ఐసీజీ చేసిన పదో అరెస్టు ఇది.