ప్రస్తుతం యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సాహోసతపూరితమైన రీల్స్ చేస్తూ.. ఫేమస్ కావాలని చూస్తున్నారు. అయితే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీల్స్ చేస్తూ తన ప్రాణాన్ని కోల్పోయింది.
బీహార్ లో కల్తీ మద్యం కలకలం సృష్టిస్తోంది. సమస్తిపూర్ జిల్లాలోని మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి ఒక యువకుడు మరణించగా, మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
పంజాబ్-హర్యానా హైకోర్టు శంభు సరిహద్దును తెరవాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం న్యాయస్థానం వారం రోజుల గడువు ఇవ్వగా అది ఇప్పటికే ముగిసింది.
మహారాష్ట్ర నుంచి పెద్ద వార్త వస్తోంది. రాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్‌లు బుధవారం తృటిలో తప్పించుకున్నారు.
కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘కల్కి’ సినిమా చూసేందుకు కొడుకుతో కలిసి మాల్‌కు వచ్చిన ఓ వృద్ధ రైతుకు మాల్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు.
ఒక వైపు రుతుపవనాల రాకతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు అనేక ప్రాంతాల్లో ఈ నీరు ఇబ్బందులు సృష్టిస్తోంది.
కేరళలోని పద్మనాభస్వామి ఆలయం లోపలికి విదేశీ మహిళలను అనుమతించలేదు. చీర కట్టుకుని తనకు కాబోయే భర్తతో ఆమె ఆలయాన్ని సందర్శించాలనుకుంది. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆమెను లోపలికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో కర్ణాటక ప్రజలకే 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం ప్రకటించారు. తాజాగా ఆ పోస్టును తొలగించడంపై రాష్ట్ర మంత్రి స్పష్టత ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి ప్రత్యేక సాయం అడిగారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
జమ్ము కశ్మీర్‌లోని దోడా జిల్లాలో బుధవారం తెల్లవారు జామున భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
వలస కార్మికులపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేషన్ కార్డుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు వ్యక్తులను సీబీఐ అరెస్ట్ చేసింది. అరెస్టయిన నిందితులను పంకజ్ సింగ్ అలియాస్, రాజుగా గుర్తించారు. పంకజ్ సింగ్ హజారీబాగ్ ట్రంక్ నుండి నీట్ పేపర్లను దొంగిలించాడని సీబీఐ ఆరోపించింది.
ఉత్తరాఖండ్‌లో ఓ బాబా 16వేల అడుగుల ఎత్తులో ఓ ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ఈ వ్యవహారం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. దేవుడు చెప్పాడని పవిత్ర సరస్సుకు అత్యంత సమీపంలో 16వేల అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించుకున్నాడు.
పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమతి ఏజెన్సీకి భారతదేశం మొదటి విడత 2.5 మిలియన్ డాలర్లను విడుదల చేసింది.
అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద ఉన్న బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.