కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల పని గంటల్ని 14 గంటలకు పెంచే దిశగా కాంగ్రెస్ సర్కార్ కీలక బిల్లును సిద్ధం చేసింది. కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లు-2024ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది.
గౌరీకుండ్-కేదార్‌నాథ్ పాదచారుల మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. చిర్బాస సమీపంలోని కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి.
కువైట్ సిటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో భారతీయ దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు శనివారం తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల దృష్ట్యా, ఆ ప్రాంతంలో ఉగ్రవాద సంఘటనలను నిరోధించడానికి భారత సైన్యం దళాలను తిరిగి మోహరించింది. అత్యున్నత శిక్షణ పొందిన, పెద్దఎత్తున ఈ ప్రాంతంలోకి చొరబడిన ఉగ్రవాదులను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం తొలిసారిగా దేశంలో జరుగుతోంది.
కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మలప్పురం జిల్లా ఉత్తర ప్రాంతంలో అనుమానిత నిపా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. స్పీకర్ నిర్ణయాలను సభ లోపల లేదా బయట ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శించరాదని ఎంపీలకు గుర్తు చేశారు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. శనివారం దక్షిణ ముంబైలోని గ్రాండ్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది.
హర్యానాలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ-పంజాబ్ లాగానే ఇప్పుడు హర్యానాలో కూడా అదే మోడల్‌ను తీసుకురావాలని ఆప్ ప్రయత్నిస్తోంది.
Jharkhand : జార్ఖండ్‌లోని రాంచీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అసిస్టెంట్ పోలీసులు గత కొన్ని రోజులుగా సమ్మెలో ఉన్నారు. తమ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత జిల్లా పోలీసు సర్వీసులతో తమను సర్దుబాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
నీట్ యూజీ పేపర్‌కు సంబంధించిన వివాదం ఇప్పట్లో ముగిసిపోయే సూచనలు కనిపించడం లేదు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
యూపీలోని గోండాలో జరిగిన రైలు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రెండు నిమిషాల ఆలస్యం కారణంగా రైలు ప్రమాదం జరిగింది. గురువారం చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న 1509 నంబర్ రైలు మాన్‌కాపూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది.
భారీ వర్షాలకు ముంభైలో ఓ పాత భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించారు. ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
నీట్-యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష కేంద్రాల వారీగా నీట్-యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మన పీఎం నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఆయన అసలు ఎందుకు శుభాకాంక్షలు తెలిపారంటే..?