ఏడో దశ లోక్‌సభ ఎన్నికలలో జూన్ 1న వారణాసిలో కూడా ఓటింగ్ జరగనుంది. అయితే అంతకుముందే గంగానది రాజకీయాలు ముమ్మరమయ్యాయి.
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. బెదిరింపు రావడంతో విమానాన్ని శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో మొత్తం 178 మంది ప్రయాణికులు ఉన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇదిలా ఉంటే ఈ 2024 ఎన్నికల వేళ ఆదాయపు పన్ను శాఖకు దిమ్మతిరిగే షాకిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఎండల ప్రభావానికి గత 24 గంటల్లో 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 26 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్లిపోయారు. కాషాయ వస్త్రాలు ధరించి సాధువులా మారారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ఆయన 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు.
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నికల ర్యాలీల్లో పట్నాయక్ ఆరోగ్యంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని హాసన్ నుంచి సస్పెండ్ అయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టు రద్దుకు పూనుకుంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉన్న పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది.
జమ్మూలోని అఖ్నూర్‌లో భక్తులతో నిండిన బస్సు రోడ్డు పక్కన ఉన్న 150అడుగుల లోతైన లోయలో పడింది. బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 16 మంది మరణించగా, 28 మందికి పైగా గాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికలు చివరి దశలో ఉన్నాయి. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ఆజంఖాన్‌కు భారీ షాక్ తగిలింది. దుంగార్‌పూర్ కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆజం ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌లు జూలై నెలలో వివాహం చేసుకోనున్నారు. పెళ్లికి ముందు అనేక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జామ్‌నగర్‌లో ఓ ప్రీ వెడ్డింగ్ వేడుక చేపట్టిన అంబానీ కుటుంబం ఈ సారి మరింత వైభవోపేతంగా రెండో ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఒక భారీ క్రూయిజ్‌లో ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ నీటి కొరతతో సతమతమవుతోంది. నీటి ఎద్దడిని అధిగమించేందుకు కేజ్రీవాల్ యాక్షన్ మోడ్‌లో ఉన్నారు. నీటిని వృథా చేసే వారిపై నిఘా ఉంచేందుకు ప్రభుత్వం ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో 16 మంది ఆర్మీ అధికారులు, సైనికులపై హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన సైనిక అధికారులలో ముగ్గురు లెఫ్టినెంట్ కల్నల్‌లు కూడా ఉన్నారు.
ఈ వేసవి మొదలైన దగ్గర నుంచి బుధవారం రాజస్థాన్‌లో అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఐఎండీ తెలిపింది. దిల్లీలోనూ ఇంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.