»Money Laundering Case Ed Questions Actor Kriti Verma
money laundering: రూ.264 కోట్ల స్కాంలో నటి విచారణ
రూ.264 కోట్ల ఐటీ స్కామ్‌లో జీఎస్టీ ఇన్స్పెక్టర్ నుండి నటిగా మారిన కృతిని (Kriti Verma) ఈడీ (Enforcement Directorate) విచారించింది. తన సీనియర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వందల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
రూ.264 కోట్ల ఐటీ స్కామ్‌లో జీఎస్టీ ఇన్స్పెక్టర్ నుండి నటిగా మారిన కృతిని (Kriti Verma) ఈడీ (Enforcement Directorate) విచారించింది. తన సీనియర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా వందల కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కృతి ఢిల్లీకి చెందిన జీఎస్టీ ఇన్స్పెక్టర్ (gst inspector). ఈమె ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Government Job) మానివేసి, యాక్టింగ్ కెరీర్ దిశగా వచ్చింది. 2018లో ఆమె ఆడిషన్ కోసం వెళ్లగా, రోడీస్ ఎక్స్ట్రీమ్కు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన ఫుల్ టైమ్ కెరీర్‌ను ఇటువైపు మళ్లించింది. బిగ్ బాస్ 12 ద్వారా ఆమెకు మరింత పేరు వచ్చింది. పలు వెబ్ సిరీస్‌లలో యాక్ట్ చేసింది. ఎన్నో డ్యాన్స్ షోలలో పాల్గొన్నది. ఇలాంటి ఓ డ్యాన్స్ షో సమయంలో ఆమె ప్రముఖ వ్యాపారవేత్త భూషణ్ పాటిల్‌ను కలిసింది. అతనితో రిలేషన్ షిప్ ఏర్పడింది. అతనిపై కేసు నమోదు కావడంతో పాటు… ఇప్పుడు ఆమె పేరు ఐటీ ఫ్రాడ్ కేసులో వెలుగు చూసింది. అయితే తాను ఎలాంటి పొరపాటు చేయలేదని, ఫ్రాడ్ విషయం వెలుగు చూసిన ఆరు నెలల్లోనే పాటిల్‌కు దూరం జరిగినట్లు వెల్లడించింది.
ఈ ఫ్రాడ్ కేసులో భూషణ్ పాటిల్ కీ అక్యూస్డ్‌గా ఉన్నాడు. పెద్ద మొత్తంలో అక్రమ నిధులు పాటిల్ అకౌంట్లోకి వచ్చాయని ఈడీ చెబుతోంది. ఇతని అకౌంట్ నుండి కృతి అకౌంట్లోకి రూ.1 కోటి వచ్చాయి. అయితే రిలేషన్ షిప్ కంటే ముందు… ఓ డ్యాన్స్ షో కోసం అతను తనకు ఇచ్చినట్లు చెబుతోంది. బాధ్యత కలిగిన వ్యక్తిగా తాను విచారణ సంస్థలకు సహకరిస్తానని చెబుతోంది. తనకు తెలిసిన సమాచారాన్ని వారికి ఇస్తానని అంటోంది.
గత ఏడాది ఐటీ డిపార్ట్మెంట్లోని పలువురిపై ఆదాయపు పన్ను రీఫండ్ల మోసం కేసు నమోదైంది. పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం మహారాష్ట్ర, కర్ణాటకల్లో రూ.70 కోట్ల విలువైన 32 స్థిరాస్తులు, చర ఆస్తులను ఈడీ గత నెలలో అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో భూషణ్ పాటిల్, రాజేష్ శెట్టి, సారిక శెట్టి, కృతివర్మ తదితరుల పేరిట ఉన్న భూమి, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి. కృతివర్మ హర్యానాలోని గురుగ్రామ్‌లో 2021లో సంపాదించిన ఒక ఆస్తిని విక్రయించగా ఆ డబ్బు ఆమె బ్యాంకు ఖాతాల్లోకి వచ్చింది. మోసం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిందితుల పేరుతో లోనావాలా, ఖండాలా, కర్జాత్, పూణే, ఉడిపి ప్రాంతాల్లో భూమి, పన్వెల్, ముంబై ప్రాంతాల్లో ఫ్లాట్లు, మూడు లగ్జరీ కార్లు (BMW X7, Mercedes GLS400d, Audi Q7) కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఆమెను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ ఈ స్కాంతో సంబంధం ఉన్న వివిధ సంస్థలకు చెందిన రూ.96 కోట్లను సీజ్ చేసింది. ఇప్పటి వరకు ఈడీ అటాచ్/సీజ్ చేసిన మొత్తం వ్యాల్యూ రూ.166 కోట్లకు పైగా ఉంది.