Sanjay Raut : మహారాష్ట్ర సర్కారుకు డెత్ వారెంట్(death warrant) జారీ అయిందని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్(Shiv Sena (UBT) MP Sanjay Raut) అన్నారు. తర్వలో ఏక్ నాథ్ షిండే(Ek Nath Shinde) ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. మరో 15-20రోజుల్లోనే ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే(former CM Uddhav Thackeray) నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో కీలక నేతగా ఉన్న సంజయ్ రౌత్.. ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉద్దవ్ థాకరే నాయకత్వంపై తిరుగుబాటు చేసిన 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court)లో దాఖలైన పిటీషన్ పై ప్రస్తావించారు.
కోర్టు ఆదేశాల కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందన్నారు. తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కూలిపోతుంది. ఈ ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయింది. దానిపై ఎవరు సంతకం చేయాలనేది ఇప్పుడే నిర్ణయించాలి’’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలోనే షిండే సర్కార్ కూలిపోతుందని సంజయ్ రౌత్(Sanjay Raut) పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలో గత ఏడాది రాజకీయ సంక్షోభానికి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే, సీఎం ఏక్ నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన క్రాస్ పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) గత నెలలో తీర్పును రిజర్వ్(Reserve) చేసింది. ఇది త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.