»Intelligence Agencies Sound Alert Of Attack On Khalistan Leader Amritpal Singh
Ib sound alert on Amritpal Singh:అమృతపాల్ సింగ్‌పై దాడికి ఛాన్స్, ఐబీ వార్నింగ్
Ib sound alert on Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)పై దాడి జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు సంఘ వ్యతిరేక శక్తులు దాడికి తెగబడొచ్చని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులకు (punjab police) సమాచారం అందజేసింది.
Intelligence agencies sound alert of attack on Khalistan leader Amritpal Singh
Ib sound alert on Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh)పై దాడి జరిగే అవకాశం ఉందని భారత నిఘా సంస్థలు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు సంఘ వ్యతిరేక శక్తులు దాడికి తెగబడొచ్చని తెలిపింది. ఈ మేరకు పంజాబ్ పోలీసులకు (punjab police) సమాచారం అందజేసింది. అలాగే వారిస్ పంజాబ్ దే జిల్లా అధ్యక్షులకు ఉగ్రవాద సంస్థల నుంచి నిధుల (funds) విషయమై ఓ కంట కనిపెట్టాలని సూచించాయి.
పాకిస్థాన్ ఐఎస్ఐ (isi) అమృత్ పాల్‌కు నిధులు సమకూరుస్తోందని భారత నిఘా సంస్థలు నిన్న అనుమానించిన సంగతి తెలిసిందే. అమృత్ పాల్‌ను (Amritpal Singh) ఐఎస్ఐ బ్రిందాన్వాలె 0.2గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని పేర్కొన్నాయి. జర్నాలీ సింగ్ బ్రిందాన్ వాలె సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్థాన్ కావాలని పోరాడారు. 1984లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో (operation blue star) చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమృత్ పాల్ సింగ్‌ను బ్రిందన్ వాలె 0.2గా ప్రమోట్ చేస్తోందని. . అందుకోసం నిధులు అందజేస్తోందని సమాచారం.
ఇటీవల అజ్నాలాలో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరుడు లవర్ ప్రీత్ సింగ్ తుపాన్, (lover preeth singh) పంజాబ్ పోలీసులు (punjab police) మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అతని మద్దతు దారులు కత్తులు, తుపాకులు తీసుకొని పోలీసు బారికేడ్లను చేదించి మరీ అజ్నాలా (ajnala) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులు తమను ఏమీ చేయొద్దని గురు గ్రంథ్ సాహిబ్‌ను (guru granth sahib) అడ్డు పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అది వారి పవిత్ర గ్రంథం కావడంతో.. పోలీసులు తమను ఏమీ చేయరని రెచ్చిపోయారని చెబుతున్నారు. గొడవ నేపథ్యంలో లవర్ ప్రీత్ తుఫాన్‌ను (lover preeth singh) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అమృత్ పాల్ సింగ్‌కు (Amritpal Singh) ఉగ్రవాద సంస్థ నుంచి నిధులు సమకూరాయని తెలిసింది.
అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh), అతని అనుచరులతో పోలీసులు (police) చర్చలు జరిపారు. ఆ తర్వాత లవ్ ప్రీత్ సింగ్‌ను (lover preeth singh) విడుదల చేయాలని పంజాబ్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ (congress), దమ్‌దామీ తత్సల్ ఖండించాయి. అజ్నాలా ఘటనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.