»Gwalior Woman Asks Authorities To Release Her Husband On Parole To Have Kids In Madhya Pradesh
Madhya Pradesh:పిల్లల్ని కనాలి.. మా ఆయనకు బెయిల్ ఇవ్వండి సార్
కొత్తగా పెళ్లయింది. ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. ఇంతలోనే పోలీసులు వచ్చి భర్తను జైలుకు తీసుకెళ్లారు. పెళ్లి అయిందన్న ఆనందం నాలుగు రోజులు కూడా నిండకుండానే భర్త జైల్లో ఉండడంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పోలీసులు ఓ మర్డర్ కేసులో తన భర్తను అరెస్ట్ చేయడంతో అతడికి శిక్ష పడింది. గత ఏడేళ్లుగా ఆయన ఇంకా జైలులోనే ఉన్నాడు.
Madhya Pradesh:కొత్తగా పెళ్లయింది. ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. ఇంతలోనే పోలీసులు(Police) వచ్చి భర్తను జైలు(Jail)కు తీసుకెళ్లారు. పెళ్లి అయిందన్న ఆనందం నాలుగు రోజులు కూడా నిండకుండానే భర్త జైల్లో ఉండడంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పోలీసులు ఓ మర్డర్ కేసులో తన భర్తను అరెస్ట్(Arrest) చేయడంతో అతడికి శిక్ష పడింది. గత ఏడేళ్లుగా ఆయన ఇంకా జైలులోనే ఉన్నాడు. ఆ భార్య ఇంకా భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇటీవలే ఆమె జైలు అధికారులను కలిసి తన భర్తను బెయిల్ పై విడుదల చేయాలని, తనకు అమ్మ కావాలని ఆశగా ఉందంటూ పోలీసులను విజ్ఞప్తి చేసింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్(madhya pradesh)లోని లశివ్పురికి చెందిన కుటుంబం వారి కొడుకు దారా సింగ్ జాతవ్‌కు ఏడేళ్ల క్రితం ఘనంగా పెళ్లి చేసింది. పెళ్లి చేసుకున్న కొద్ది కాలానికే ఓ మర్డర్ కేసులో ప్రమేయం ఉందని భావించిన పోలీసులు దారా సింగ్ జాతవ్‌ను జైలులో వేశారు. దారా సింగ్ జాతవ్ తండ్రి కరీం సింగ్ జాతవ్ ఈ విషయమై మాట్లాడాడు. తమ కుటుంబం కొడుకు పెళ్లిని ఇంకా పూర్తిగా వేడుక చేసుకోనేలేదని, పోలీసులు అంతలోనే తమ కొడుకును అరెస్టు చేసినట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను, అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, తన భార్య.. మనవడిని కావాలని అనుకుంటున్నామని తెలిపారు. కాబట్టి, కొన్ని రోజులైనా తన కొడుకును జైలు నుంచి విడుదల చేయాలని కోరాడు.
ఖైదీ విడుదల కోసం చేసిన ఆ విన్నపంను శివపురి ఎస్పీకి పంపించారు. ఈ అంశంపై గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిర్వాయ మాట్లాడారు. సాధారణంగా యావజ్జీవ కారాగారం అనుభవించే ఖైదీలు.. రెండేళ్లు గడిచిన తర్వాత తోటి ఖైదీలు, జైలు సిబ్బందితో సత్ప్రవర్తనతో మెలిగితే పెరోల్ పై విడుదల చేయడానికి అర్హులవుతారని వివరించారు. ఒక ఖైదీకి పెరోల్ ఇవ్వాలా? లేదా? అనే నిర్ణయం సదరు జిల్లాకు చెందిన కలెక్టర్ నిర్ణయిస్తారని తెలిపారు.